04 October 2007

అవునంటె కాదనిలె కాదంటె అవుననిలె

అవునంటె కాదనిలె కాదంటె అవుననిలె
అవునంటె కాదనిలె కాదంటె అవుననిలె
ఆడువారి మాటలకు అర్ధాలె వేరులె
అర్ధాలె వేరులె అర్ధాలె వేరులె

అలిగి తొలగి నిలిచినచో
అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె

చొరవ చేసి రమ్మనుచో
చొరవ చేసి రమ్మనుచో మరియాదగ పొమ్మనిలె

ఆడువారి మాటలకు అర్ధాలె వేరులె అర్ధాలె వేరులె అర్ధాలె వేరులె

విసిగి నసిగి కసిరినచో
విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టములె
తరచి తరచి ఊసడిగిన
తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలె

ఆడువారి మాటలకు అర్ధాలె వేరులె అర్ధాలె వేరులె అర్ధాలె వేరులె

అవునంటె కాదనిలె కాదంటె అవుననిలె అవునంటె కాదనిలె కాదంటె అవుననిలె
ఆడువారి మాటలకు అర్ధాలె వేరులె అర్ధాలె వేరులె అర్ధాలె వేరులె

No comments: