ఔను నిజం నువ్వంటె నాకిష్టం
ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
చలి పరద ఇక నిలవదుగ
తెలుసుకదా అహ ఆఆ
తెలిసిందే అడగాలా
అడగందే అనవేలా
చెవిలో ఇలా చెబితే చాలా
కసిరేస్తున్నా మనసుకు వినపడదో ఏమొ
విసిరేస్తున్నా నినువిడి వెనకకి రాదేమొ
నిదరోతున్నా ఎదురై కనపడతావేమొ
కదలాలన్నా కుదరని మెలి పెడతావేమొ
అంతగా కంట చూడనని మొండికేస్తే తప్పేమో
ఒంటిగా ఉండనీయనని ముందు కొస్తే ముప్పేమో
మన సలహా మది వినదుకద
తెలుసుకద ఆ ఆ
తెలిసే ఇలా చెలరేగాలా
సుడి గాలిలొ తెలియని పరుగులు తీస్తున్నా
జడపూలతొ చెలిమికి సమయము దొరికేనా
యెదరేముందొ తమరిని వివరములడిగానా
యద ఏమందొ వినమని తరుముకు రాలేనా
తప్పుకో కళ్ళుమూసుకుని తుళ్ళి రాకే నా వెంట
వొప్పుకో నిన్ను నమ్మమని అల్లుకుంటా నే జంట
నడపదుగ నిను నది వరద
తెలుసు కద ఆ ఆ
తెలిసే ఇలా ముంచెయ్యాలా
No comments:
Post a Comment