పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనె
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనె
పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనె
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనె
నదివీ నీవైతే అలనేనే
ఒక పాటా నీవైతే నీరాగం నేనే
పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె
నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే
నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే
నీ పాల పొంగుల్లొ తేలనీ నీ గుండెలొ నిండనీ
నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లొ కొలువుండనీ
పరువం వానగా ....
నీ గారల చూపులె నాలొ రేపేను మోహం
నీ మందార నవ్వులె నాకె వేసేను బంధం
నా లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో
నా రాగబంధాల చాటులో నీ పరువాలు పలికించుకో
పరువం వానగా ....
No comments:
Post a Comment