12 May 2010

పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో

పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో ||2||
అల్లరి చేదాం చలో చలో
||పల్లెకు||
ప్రొద్దు వాలే ముందు గానే ముంగిట వాలేమూ
||పల్లెకు||

ఆటా పాట లందు కవ్వించు కొంటె కోణంగీ ||2||
మనసేమో మక్కువేమో..మనసేమో మక్కువేమో
నగవేమో వగేమో కనులార చూతమూ

||పల్లెకు||

నన్ను చూడగానే చిననాటి చనువు చూపేనో ||2||
నా దరికి దూకునో.. నా దరికి దూకునో
తానలిగి పోవునో ఏమౌనో చూతమూ

||పల్లెకు||

ప్రొద్దు వాలే ముందు గానే ముంగిట వాలేమూ
పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో...ఛలో... ఛలో...

No comments: