29 May 2010

తన ధర్మంబును పూర్తిగా మరచె కాంతాలోలుడై రాజు

తన ధర్మంబును పూర్తిగా మరచె కాంతాలోలుడై రాజు, హె-
చ్చిన కామాంధత చూడడాయెను ప్రజాక్షేమంబు, పట్టంపురా-
ణినె నిర్లక్ష్యము చేసె, మంత్రులకు నేనిన్ దర్శనంబీయడా-
యెను, దేశానికరాచకంబిటుల ప్రాప్తించెన్ గదా అక్కటా! ఆ...

నీ సుఖము, నీ భోగమె
చూసిన ఎటులమ్మ తల్లీ! చూడుము ప్రజలన్,
దేసము కోసము త్యాగము
చేసిన నీ కీర్తి నిలచు స్థిరముగ ధరణిన్

నీకు వినిపించనేలేదా, దేవా!
నాకు వినిపించిన యీ జాలి పిలుపు
నీకు వినిపించనే లేదా?

పాలించు దొర లేక పాపులు చెలరేగ (2)
అష్టకష్టాలతో అల్లాడ ప్రజలు
ఆకసము తెంచుకుని వెయి కంఠాఆలతో
ఆదుకోరమ్మనే ఆర్తారవాలు || నీకు వినిపించనేలేదా ||

No comments: