12 May 2010

సఖియా వివరించవే

సఖియా వివరించవే
సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కధ
సఖియా వివరించవే

నిన్ను దోచి కన్నులు చెదరి
కన్నె మనసు కానుక చేసి
నిన్ను దోచి కన్నులు చెదరి
కన్నె మనసు కానుక చేసి
మరువలేక మనసు రాక
విరహాన చెలికాన వేగేనని

సఖియా

మల్లెపూల మనసు దోచి
పిల్లగాలి వీచే వేళ
ఆ మల్లెపూల మనసు దోచి
పిల్లగాలి వీచే వేళ
కనువరేని వెలుగులోన
సరసాన సరదాలు తీరేనని

సఖియా

No comments: