13 May 2010

సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ

||ప|| |అతడు|
సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ
సుఖాన మనలేని వికాసమెందుకనీ
నిజాన్ని బలికోరే సమాజమెందుకనీ
అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం
.
||చ|| |అతడు|
ఆవేశంలో ప్రతి నిమిషం ఉరికే నిప్పుల జలపాతం
కత్తి కొనల ఈ వర్తమానమున బ్రతకదు శాంతి కపోతం
బంగరు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు
భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే
శిరసు వంచెనదిగో ఎగిరే భరత పతాకం
చెరుగుతోంది ఆ తల్లి చరితను విశ్వవిజయాల విభవం
|| సురాజ్యమవలేని ||
.
||చ|| |అతడు|
కులమతాల దవానలానికి కరుగుతున్నది మంచు శిఖరం
కలహముల హాలాహలానికి మరుగుతున్నది హిందు సంద్రం
దేశమంటే మట్టి కాదను మాట మరిచెను నేటి విలయం
అమ్మ భారతి బలిని కోరిన రాచకురుపీ రాజకీయం
విషము చిందెను జాతి కనుమునా ఈ వికృత గాయం

No comments: