29 May 2010

రామ రామ శరణం, భద్రాద్రిరామ శరణం

రామ రామ శరణం, భద్రాద్రిరామ శరణం!
తాటకిని వధించి మునిరాజు కృపను గాంచి (2)
శిలకు ప్రాణమిచ్చి సన్నుతులు గాంచినట్టి || రామ రామ ||

శివుని విల్లు ద్రుంచి, శ్రీజానకిని గ్రహించి (2)
జనకు మాటనెంచి వనవాసమేగినట్టి || రామ రామ ||

రావణుని వధించి ఘనకీర్తి జగతినించి
పాపముల హరించి మునులెల్ల గాచినట్టి || రామ రామ ||

No comments: