12 May 2010

పాల పొంగే పాడే పాట సందె రాగాలు వినిపించెనే

పాల పొంగే పాడే పాట సందె రాగాలు వినిపించెనే
పాలవిల్లి నాదం .. అది జాజిమల్లి కోసం..
కమ్మనైనా ఊహలన్ని...కోరి పాడే గుండెలోని

పాల పొంగే పాడే పాట సందె రాగాలు వినిపించెనే
పాల పొంగే...

చల్లని గాలి ఊరించే రాగ గంధమే.
అల్లరి ఆశ అందించే స్నేహ బంధమే..
తొలకరి కలలే ఊరేగే చెలియ కళ్ళలో..
గడసరి వయసే పొంగేనే చిలిపి గుండెలో..

అనుక్షణం నిన్నే ఆరాధించినానే..
నిన్నే నిన్నే చేరీ సుఖాలలో తేలి..
పలికేనే ఈ ప్రేమ కధ .. సరికొత్త కొత్త పలుకే..

పాల పొంగే పాడే పాట సందె రాగాలు వినిపించెనే
పాల పొంగే...

మన్మధ బాణం వేసావే పసిడి వయసుపై..
వెన్నెల రాగం చిందేవే కన్నె మనసుపై..

మనసే పలికే ఈనాడే వింత గాధలే..
మాటలలోనే రేగేనే వేయి వన్నెలే
పదే పదే నన్నే వేదించేను అందం
మరీ మరీ నిన్నే చేరాలని ప్రాయం

చేరాలి జత చేరాలి .. నా కళ్ళలోన నీవే..

పాల పొంగే పాడే పాట సందె రాగాలు వినిపించెనే ..
పాల పొంగే పాడే పాట సందె రాగాలు వినిపించెనే ..
పాలవిల్లి నాదం .. అది జాజిమల్లి కోసం..
కమ్మనైనా ఊహలన్ని...కోరి పాడే గుండెలోని
పాల పొంగే పాడే పాట సందె రాగాలు వినిపించెనే ..
పాల పొంగే..

No comments: