12 May 2010

సరేలే ఊరుకో..... పరేషానెందుకు

||పల్లవి||
సరేలే ఊరుకో..... పరేషానెందుకు.....
చలేసే ఊరిలో జనాలే ఉండరా....
ఎడారి దారిలో ఒయాసిస్సుండదా......
అదోలా మూడుకాస్తా మారిపోతె మూతి ముడుచుకునుంటామా........
ఆటలోను పాటలోను మూడు మళ్ళి మార్చుకోమ
మేరానాం జోకరు.... మేరాకాం నౌకరు.....
ఇదో నాచేతిలో అలాదీన్ లాంతరు....
ఎనీథింగ్ కోరుకో క్షణంలో హాజరు......
ఖరీదేం లేదుగాని ఊరికేనే ఊపురాదే ఓ మైనా
క్లాప్సు కొట్టి ఈలలేస్తే చూపుతానే నా నమూన

||చరణం 1||
పిల్లిపిల్లదెప్పుడు ఒకే మాటకద.... మియావ్ మియావ్ మియావ్ మియావ్ మియావ్ మియావ్
కోడిపిల్లదెప్పుడు ఒకే కూతకద.... కొ కొ కోక్కొరొకొ కొ కొ కొక్కోరొకొ
కోయిలమ్మ ఆకలైనా ట్యూను మాత్రం మార్చదే
రామచిలుక రాతిరైనా కీచురాయై కూయదే
అలాగే నీపెదాల్లో నవ్వులెప్పుడు వాడనీయకె చిలకమ్మా
కష్టమొస్తే కేరుచెయ్యక నవ్వుతో తరిమేయవమ్మ

||చరణం 2||
గూటిబిళ్ళ ఆడదాం సిక్సర్ కొడదాం..... క్రికెట్ కాదుకాని ఫన్నిగానే ఉంది
ఏటిలోన దిగుదాం ఈతలు కొడదాం.... బఫెల్లోసుకది బాత్రూం కాదమరి
రాణిగారి ఫోజులో నువు కూరుచోమ్మ ఠీవిగా
గేదెగారి వీపుమీద షైరుకెళ్దాం స్టైలుగా
జురాసిక్ పార్కుకన్నా బెస్టుప్లేసి పల్లెటురు బుల్లెమ్మా
బోలెడన్ని వింతలుంటయ్ బోరులేక చూడవమ్మ

No comments: