12 May 2010

రా రా సరసకు రారా

రా రా సరసకు రారా
రా రా చెంతకు చేర (2)
ప్రాణమే నీదిరా,
ఎలుకో నా దొర
శ్వాసలో శ్వాసవై రారా ..తోం తోం తోం (2)
ఆఆ…
ధిరనన ధిరనన

నీపొందు నే కోరి
అభీసారికై నేను
వేచాను సుమనొహరా, ఆ…

కాలాన పరుగైన
ఆనంద రాగాలు వినిపించ
నిలిచానురా

తనన ధీం త ధీం త ధీం తన (3)
ధీం థనా

వయసు జాలమొపలేదుర
మరులుగొన్న చిన్నదాన్నిరా
తనువుబాధాతీర్చరావేరా
రావేరా..

సల సల సల రగిలిన
పరువపు పొదయిది
తడిపొడి తడిపొడి
తపనల స్వరమిది
రా రా రా రా రారా…

ఏ బంధమో ఇది ఏ బంధమో
ఏ జన్మబంధాల సుమగంధమో

ఏ స్వప్నమో ఇది ఏ స్వప్నమో
నయనాల నడయాడు తొలి స్వప్నమో
విరహపు వ్యధలను వినవా
ఈ తదబడు తనువును కనవా
మగువల మనసులు తెలిసి
నీ వలపును మరచుట సులువా
ఇది కనివిని ఎరుగని మనసుల కలయిక
సరసకు పిలిచితి విరసము తగదిక
జిగిబిగి జిగిబిగి సొగసుల మొరవిని
మిలమిల మగసిరి మెరుపుల మెరయగా

రా రా రా రా రారా…

తాం తరికిట ధీం తరికిట తోం
తరికిట నం తరికిట…

No comments: