12 May 2010

ఇది కలయని నేననుకోన ..

ఇది కలయని నేననుకోన .. కలనైన ఇది నిజమౌన..
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని .. కలదో? లేదో? అనుకోనా.. (2)

నీ ఊహల ఊయలలోన .. ఉర్వసినై ఊగిపోన
నీ అడుగుల సవ్వడిలోన సిరిమువ్వై నిలిచిపోన (2)

నీ కంటిపాపలోన నా నీడ చూసుకోన
నీ నీడ కలువలలోన నూరేళ్ళు ఉండిపోన

ఇది కలయని నేననుకోన .. కలనైన ఇది నిజమౌన..
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని .. కలదో? లేదో? అనుకోనా..

నీ జీవన గమనంలోన జానికినై నడచిరాన
నీ మయూరి నడకలలోన లయ నేనై కలసిపోన

నీ సిగ్గుల బుగ్గలలోన ఆ కెంపులు నే దోచుకోన
నను దోచిన నీ దొరతనము నాలోనే దాచుకోన ..(2)

ఇది కలయని నేననుకోన .. కలనైన ఇది నిజమౌన..
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని .. కలదో? లేదో? అనుకోనా

No comments: