12 May 2010

వాలు కనులదానా

వాలు కనులదానా
వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే ఓ ఒక మాట రాక
ఒక మాట రాక మూగబోతినే

చెలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి
రేయి నాకు కనుల కునుకు లేకుండ పోయింది నీ ధ్యాసే అయ్యింది
తనువు తరిగి రేయి పెరిగి వళ్ళంతా పొంగింది ఆహరం వద్దంది
క్షణక్షణం నీ తలపుతో తనువు చిక్కి పోయెలే
ప్రాణమిచ్చి ఓ హ్రుదయమా నీకు సాటి ఏది ప్రియతమా
నీ కీర్తిలోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలుక
అజంతా సిగ్గులు ఒలక చిలకా ఆ
నీ కీర్తిలోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలుక
అజంతా సిగ్గులు ఒలికే రోజే నిను నేను చేరుకోనా

దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి
ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది
ఘడియ ఘడియ ఒడిని కరగు రసవీణ నీవేను నీ కలి తామేను
వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
తనువు మాత్రమిక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది
జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంటా చెలియా ఆ
జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంటా చెలియా నీ సొగసుకేది సాటి

No comments: