12 May 2010

ఛూ మంతర్ కాళీ

ఛూ మంతర్ కాళీ.. ఇది జంతర మంతర మోళీ..
మాయా లేదు, మంత్రం లేదు.. యంత్రం లేదు, తంత్రం లేదు
మొసం గీసం మొదలే లేదు.. మస్క గొట్టె సిట్కా ఏదో బయటెట్టేస్తే.. సరదా బోదూ...

ఢమా ఢం డోలు కట్టి మోళి కట్టె ఆట సూడండీ
తమాషా హొరు బుట్టె గాలి పాటె ఆలకించండి
ఇలాకా ఓలు మొత్తం ఇలాటి సిత్రం యాడా లేదండి...
చలాకి చేతి వాటం చూడ కుండా ఎల్లిపోకండి

అరె ఇందరి ముందర ఇందర జాలం
చిందర వందర చిందుల మేళం
గలాట గారడి గందర గోళం
తెగించి ఆడె తళాంగు తాళం...

వారెవ్వా ఏవి ఛాన్సని తేరగ చూసి జారుకోకండి
శభాషని తోచినంత ధర్మం చేస్తే వూరికె పొదండి
ఇనాం ఇచ్చే నవాబుంటే సలామంటాం
ఇదల్చని బాబుంటే డబుల్ దండాలంటాం....


మనిద్దరి మధ్య లో ఏ జన్మలో ఏ తీరని రుణముందొ
మరెందుకు ఇంతలొ ఈ బందనం ఇన్నింతలు పెరిగిందొ
అమాయకమైన నీ చిన్నారి నవ్వును ఏ తల్లి కందొ
ఇటే నీ దారి వుందని నిన్ను ఏ సుడిగాలి పంపిందో

పాపం పుణ్యం దెవుడికెరుక పేదకు దొరికిన బంగరు కణిక
పాలు వెన్నా లేవని అనక ప్రేమను తాగి పెరగవె చిలకా

వలేసే పాడు లోకం కంట పడక వుండు నా ఎనకా
ఇలా నా గుండెలేనే గువ్వ లా కొలువుండి పో ఇంకా
ఇటేపొస్తే యముడ్నైనా నిలేస్తానే
మరింక ఏ కీడు నీ వంకా రా..లే..దు...

జాగోరే బేతాళా నీ జాదు సూపెట్టాలా...
కళ్ళకు చుట్టూ గంతలు గట్టు
ఐనా అంతా సూస్తున్నట్టు అసలు నకిలీ
కనిపెట్టాలా దగాలు సేసే మగాను బావుల
ముసుగూ లొసుగూ పసిగట్టాలా

జనం లో జెంటిల్మన్ లై సెలామణయ్యే సిల్లర నాయాల్లు
క్షణం లో కళ్ళు మూసి జెల్ల గొట్టి సల్లగ పోతారు
మహా మహ బేతాలుడికే బేజరెత్తె మాయ మరాఠీలు
పరాగ్గ వున్నారంటే పంగ నామం బెట్టి పోతారు

అరె డబ్బూ దస్కం జాగర్తండి జగత్కిలాడీలున్నారండీ
మా కన్నా మా పనొళ్ళు లెండి కొమ్ముల్దిరిగిన కంత్రీల్లెండి

మాదంతా పాడు పొట్టకు కూడు పెట్టే పాత ఇద్యండి
దగాలు దారుణాలు శాత గాని కోతులాటండీ
కులాసాగా ఖూనిల్చేసే కసాయోళ్ళు
దగుల్బాజీ గాళ్ళు సుట్టూరా వున్నారూ....
జాగర్తండీ బాబు... అమ్మా జాగర్తా...

No comments: