12 May 2010

సిరులొలికించే చిన్ని నవ్వులె మణి మాణిక్యాలూ

సిరులొలికించే చిన్ని నవ్వులె మణి మాణిక్యాలూ...
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలూ..
బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలూ..
చిటి పొటి పలుకుల ముద్దు మాటలే మా ధన ధాన్యాలు
ఎదగాలి ఇంతకు ఇంతకు ఇంతై ఈ పసికూనా
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
మహరాజులా జీవించాలి నిండు నూరెళ్ళూ...

||సిరులొలికించె||

జాబిల్లి జాబిల్లి జాబిల్లీ... మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లీ...

నాలో మురిపెమంతా పాల బువ్వై పంచనీ..
లో లో ఆశలన్నీ నిజమయెలా పెంచనీ..
మదిలో మచ్చ లేనీ చందమామె నువ్వని
ఊరు వాడ నిన్నె మెచ్చుకుంటే చూడనీ...
కలకాలము కనుపాపల్లె కాసుకోని
నీ నీడలొ పసిపాపల్లె చేరుకోని..

||సిరులొలికించె||

వేసా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా..
నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా..
నాలో అణువు అణువూ ఆలయం గా మారగా..
నిత్యం కొలుచుకోనా అమ్మ రుణమే తీరగా..
తోడుండ గా నను దీవించే కన్న ప్రేమ
కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా...

||సిరులొలికించె||

No comments: