08 May 2010

అదే నీవంటివి అదే నేవింటిని

అదే నీవంటివి అదే నేవింటిని
గుండె అలలాగ చెలరేగ అవునంటిని
అదే నీవంటివి అదే నేవింటిని
ఏమి అనలేని బిడియాల అవునంటిని
అదే నీవంటివి అదే నేవింటిని ఈ ఈ ఈ

ఎవ్వరు లేని పువ్వుల తోట
ఇద్దరు కోరే ముద్దుల మూట
ఎవ్వరు లేని పువ్వుల తోట
ఇద్దరు కోరే ముద్దుల మూట
ఎదలో కదలాడే పెదవుల తెరవీడి
హృదిలో ఝుమ్మని రవలించిన ఆ మాట ఓ ఓ ఓ
అదే నీవంటివి అదే నేవింటిని

పున్నమి రేయి పూచిన చోట
కన్నులు చేసే గారడి వేట ఆ ఆ ఆ
పున్నమి రేయి పూచిన చోట
కన్నులు చేసే గారడి వేట
చూపులు జతచేసి ఊపిరి శృతి చేసి
తనువే ఝిల్లన కవ్వించిన ఆ మాట ఓ ఓ ఓ
అదే నీవంటివి అదే నేవింటిని

నిన్ను నన్ను కలిపిన బాట
నీలో నాలో పలికిన పాట
నిన్ను నన్ను కలిపిన బాట
నీలో నాలో పలికిన పాట
జాబిలి సక్కియగ కౌగిలి దగ్గరగా
మనసే ఝల్లన చిలికించిన ఆ మాట ఓ ఓ ఓ

అదే నీవంటివి అదే నేవింటిని
ఏమి అనలేని బిడియాల అవునంటిని
అదే నీవంటివి అదే నేవింటిని
అహా ఆ హాహా హా
ఉహూ ఊ హూ హూ హూ

No comments: