12 May 2010

పొరుగింటి మీనాక్షమ్మను చూసారా

పొరుగింటి మీనాక్షమ్మను చూసారా
వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా...
మిమ్మల్నే...
పొరుగింటి మీనాక్షమ్మను చూసారా
వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా...
పగలంతా ఇద్దరకూ తగవులు ఎన్నున్నా...||2||
చీకటి పక్కకి చేరి రాజీ కొస్తాడు
కోరిన చీరలు ఇస్తాడు...
||పొరుగింటి మీనాక్షమ్మ||

పొరుగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే...
వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే...
ఆండాళ్ళు....
పొరుగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే...
వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే...
తప్పని సరిగా ప్రతి సినిమాకు వెళతావూ ముందే..||2||
జీతం కాస్తా సినిమాకైతే మిగిలిదేముందే
చీరకు మిగిలేదేముందే...
||ఫొరుగింటి పుల్లయ్య||

పెళ్ళై మూడు ఏళ్ళు గడిచినా పొందిందేమిటి ఆండాళ్ళు...||2||
తల్లీ తండ్రీ ప్రేమ గుర్తు గా పుట్టెను బుల్లి నామాలు ||2||
వగలను చూపిస్తారే గాని నగలెపుడైనా పెట్టారా ||2||
ఓ ముత్యాల బేసరి ఇచ్చి ముక్కుకి అందం తెచ్చారా....
ఉద్యోగం ఒక మెట్టు దాటనీ కోరినదిస్తా నీకూ
ఇష్టం లేదని చెప్ప కూడదా ఎందుకు లెండి సాకు....

||పొరుగింటి మీనాక్షమ్మ||

మాటలతోటీ రెచ్చ గొట్టకే నన్నూ....
బెదిరింపులకు లొంగే దాన్ని కానూ...
కోపం వస్తే మనిషిని కాను నేనూ...
ఏం చేస్తారు..?
చెవులు మెలేస్తా..!! ఇంకేంచేస్తారు..?
దుంప తెంపెస్తా..!! ఆ తరువాతా..!!
తాట వొలుస్తా...!! హా హ హ హా....!!!

||పొరుగింటి మీనాక్షమ్మ||

No comments: